KTR : ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ..7గంటల పాటు విచారణ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-16 12:25:40  IST  )

ఫార్ములా ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను ఈ రోజు ఈడీ(ED) కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు(Seven Hours) సుదీర్ఘంగా విచారించారు(Long Investigation).

KTR : ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ..7గంటల పాటు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను ఈ రోజు ఈడీ(ED) కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు(Seven Hours) సుదీర్ఘంగా విచారించారు(Long Investigation). ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాయంకు చేరుకున్న కేటీఆర్‌ను విచారణ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది.

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈడీ విచారణలో కేటీఆర్ ను ప్రధానంగా నగదు బదిలీ చుట్టు ప్రశ్నలు సంధించారని..నిబంధనలు పాటించకుండా ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి పంపడంపై ఈడీ వరుస ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండీఏ(HMDA) ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫేమా(FEMA) నిబంధనలు ఉల్లంఘనపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించినట్లుగా సమాచారం.

కేటీఆర్ విచారణ సందర్భంగా బషీర్ భాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే అరవింద్‌కుమార్, బీఎల్ ఎన్ రెడ్డిని విచారించారు. అరవింద్‌కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించారు.

Next Story