KTR: డూప్లికేటు గాంధీలకు బుద్ధి రావాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

KTR: డూప్లికేటు గాంధీలకు బుద్ధి రావాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో బీఆర్ఎస్వీ (BRSV) కాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీసేవలో దరఖాస్తు చేసుకున్న వారికి 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణ (Telangana)ను దేశానికి దిక్సూచిలా తీర్చిదిద్దామని అన్నారు. వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5 మెడికల్ కాలేజీలను 33కు పెంచామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ (Congress) చెప్పిందని.. 420 హామీలతో గెలిచి 15 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అందుక నిరసనగా జనవరి 30న గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. డూప్లికేట్ గాంధీలకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆ మహాత్ముడిని కోరుతామని సెటైర్లు వేశారు. తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్‌వీ (BRSV) పాత్ర కీలకమని అన్నారు. పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story