KTR.. ఆశోక్‌నగర్ వెళ్ళే దమ్ముందా? టీ కాంగ్రెస్ సవాల్!

by Disha Web Desk 4 |
KTR.. ఆశోక్‌నగర్ వెళ్ళే దమ్ముందా?  టీ కాంగ్రెస్ సవాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రదేశాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఫేమస్ నిలోఫర్ కేఫ్‌కు వెళ్లీ సాధరణ పౌరుడిలా అక్కడ చాయ్ తాగి.. అక్కడే ఉన్న ప్రజలతో ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. నిన్న కూడా పాతబస్తీలోని ఫేమస్ ఐస్‌క్రీం సెంటర్, మదినాలోని షాదాబ్ రెస్టారెంట్‌కు ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్‌ ప్రోటోకాల్‌ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యాని ఆర్డర్ ఇచ్చుకోని తిన్నారు.

ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. అటు హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడి మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించింది. హైదరాబాద్‌లో ఆశోక్‌నగర్‌కి వెళ్లే దమ్ముందా అంటూ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ సవాల్ చేసింది. అయితే ఆశోక్‌నగర్‌లో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రదేశం కాబట్టి కాంగ్రెస్ ఈ సవాల్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed