- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్‌కి డెడ్‌లైన్.. 48 గంటల్లో సారీ చెప్పాలని KTR డిమాండ్.. లేకపోతే..!
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణ అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణ అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌ని డిమాండ్ చేశారు. లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హెచ్చరించారు. బండి సంజయ్ నిర్లక్ష్యంతో చేసిన వ్యాఖ్యలు ఈసారి హద్దుమీరాయి అని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసం ఇంకెన్నాళ్లు ఇలా రోడ్లపై చౌకబారు విమర్శలు చేస్తారని సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ విభాగంపై బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని.. బండి సంజయ్‌కి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే, కేవలం వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందో.. ఎలా పని చేస్తుందో కూడా బండి సంజయ్‌కి అవగాహన లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలు అన్నీ నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.






