- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఆ హామీ ఏమైంది రేవంత్ రెడ్డి?: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ తీరు సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఫార్మాసిటీ (Pharma City) భూములలో కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఏడాదిన్నరగా ఇవ్వడం లేదని, మీర్‌ఖాన్‌పేటలోని లేఅవుట్‌లో రైతులకు పొజీషన్ ఇస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ (Congress) లీడర్లతో కలిసి ఫార్మాసిటీ భూములను కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఓ పోస్టు చేశారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతన్నలకు నష్టపరిహారంగా కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని రైతన్నలకు దక్కాల్సిన ఇండ్ల స్థలాలను అతి తక్కువ రేట్లకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతన్నలకు నష్టపరిహారంగా దక్కాల్సిన దానిని కాంగ్రెస్ నేతలు ఎందుకు దోచుకుంటున్నారని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతన్నలను కూడా వదలకుండా, దోపిడీకి గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు సిగ్గుచేటని దుయ్యబట్టారు.






