KTR: వాళ్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

by Prasad Jukanti |

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR: వాళ్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్ బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం జరిగి మూడు నెలలు కావొస్తున్నా మృతదేహాలను వెలికి తీయలేకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే మూడు నెలల్లో అంగారక గ్రహం నుంచి మానవులను వెనక్కి తీసుకురాగలరు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందునా ఎస్ఎల్ బీసీ సొరంగం నుంచి మృతదేహాలను తీసుకురాలేకపోయారని విమర్శించారు. మృతదేహాలను వెనక్కి తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అక్కడ గుప్పెడు మన్ను కూడా తీయలేకపోయారని ముఖ్యమంత్రికి సిగ్గుగా లేదా అని ధ్వజమెత్తారు. కనీసం సంతాప ప్రకటన చేసి మరణించిన కుటుంబాలను పరామర్శించే సానుభూతి కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేదా అని ధ్వజమెత్తారు. సొరంగంలో ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా మీ కమిషన్ల కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని అందుకు బాధిత కుటుంబాల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరాలన్నారు.

Next Story