- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్
ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్నివర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్నివర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన న్యాయ నిపుణుల బృందం, లీగల్ సెల్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై సంతకం చేశారని.. అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారని.. తర్వాత సంతకం పెడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారని.. అల్టిమేట్‌గా సంతకం పెట్టారని ఆరోపించారు. వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో ఫైల్‌పై సంతకం అయిందని చెప్పించారని అన్నారు. కానీ, 800 రోజులైనా 6 గ్యారంటీల అమలకు అతీగతి లేకుండాపోయిందన్నారు.
ఆ ఫైల్ ఇప్పటివరకు దొరకడం లేదు..
అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే శుక్రవారం ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. స్పీకర్ కార్యాలయాన్ని, మండలిలో చైర్మన్ కార్యాలయంలో కలిసి ఈ బిల్లును అనుమతించాలని కోరుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ బిల్లును సభలో అనుమతించాలన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కోరితే ఆమోదం ఈజీగా జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఇలా ప్రతి వర్గం తరఫున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోనని అన్నారు. అందుకే తమ సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్‌తో కూర్చొని ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశామని చెప్పారు. రేవంత్ సంతకం పెట్టిన ఫైల్ ఇప్పటివరకు దొరకడం లేదంట అని.. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటామని అన్నారు. రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడైనా తప్పిపోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా? అనేది తేలాల్సి ఉన్నదన్నారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు అయిపోయాయని.. మిగిలింది ఒక్కటేనని.. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగో ఎలక్షన్ బడ్జెట్ అని.. దానికి అర్థం పర్థం ఉండదని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలుస్తామని.. మద్దతు ఇవ్వాలని కోరుతామని స్పష్టం చేశారు.






