KTR: బీజేపీ రామచంద్రా నోరు తెరవరేం? మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

భద్రాద్రి రాములోరి భూముల కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే.

KTR: బీజేపీ రామచంద్రా నోరు తెరవరేం? మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాద్రి (Bhadradri Temple) రాములోరి భూముల కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర ట్వీట్ చేశారు. బీజేపీ (Telangana BJP) రామచంద్రా నోరు తెరవరేం? రాములోరి భూములను ఆక్రమించుకుంటోంటే మాటైనా మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈ సారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామని అనుకుంటున్నారా? అని ప్రశ్నలు సంధించారు. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రాములోరి భూముల కబ్జా విషయంపై (Narendra Modi) ప్రధాని మోడీతో మాట్లాడతారో.. మీ దోస్త్ దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. అంటూ సూచించారు. భద్రాద్రిని కాపాడండి.. ఆక్రమణల చెరలో నుంచి విడిపించండి.. అని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. పదేళ్లు అధికారం వెలగబెట్టి భద్రాద్రి భూముల విషయంలో మీరు ఏమి చేశారని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. రాముడి భూములు పోతుంటే బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని పలువురు నెటిజన్‌లు అసహనం వ్యక్తం చేశారు.

Next Story