- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాష్ట్రం కాదు.. దివాలా తీసింది మీరు’.. CM రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ దివాలా తీయలేదని.. మీరు, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీనే దివాలా తీసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా, సోమవారం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఉద్యమ ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమరానికి దిగడం సరికాదని అన్నారు. అసలు ఉద్యోగ సంఘాలు ఎవరిపై సమరం చేస్తున్నాయి? తెలంగాణ ప్రజలపై సమరం చేస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా అని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందామని ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే.. దుబారా తగ్గించుకోకపోతే దివాలా తీసే పరిస్థితి రావడం ఖాయమన్నారు. దీంతో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.






