- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా..?’.. కొండా సురేఖకు కేటీఆర్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున ఆమెపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బాధ్యత వహించాలనడం సమంజసం కాదని, అదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరుగుతోందని చెప్పారు. ఒక్కసారి గతంలో కెళితే కొండా సురేఖ తమపై చేసిన బూతు వ్యాఖ్యలన్నీ బయటకొస్తాయని గుర్తు చేశారు. కావాలంటే గతంలో ఆమె మాట్లాడిన వీడియోలు కూడా తాను పంపిస్తానంటూ మీడియాతో అన్నారు. ‘‘అప్పట్లో నేను హీరోయిన్ల ఫోన్లు టాప్ చేస్తున్నానంటూ ఆరోపణలు చేశారు. మరి అలాంటి ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు ఏడవలేదా..? ఈ బాధ అప్పుడు గుర్తుకు రాలేదా..?’’ అని నిలదీశారు.
కాగా.. బీజేపీ నేత ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అదే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు మర్యాదపూర్వకంగా నూలు దండ వేశారు. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కొండా సురేఖ ఇంతలా తనని అవమానిస్తున్నా కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.