ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? - KTR

by velandi.Saikiran |

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit shah) తెలంగాణ ( Telangana) టూరు, పసుపు బోర్డు (National Turmeric Board)

ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? -  KTR
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit shah) తెలంగాణ ( Telangana) టూరు, పసుపు బోర్డు (National Turmeric Board) ప్రారంభోత్సవం పై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ( KTR) కౌంటర్ ఇచ్చారు. అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా అంటూ నిలదీశారు. ఇదే సంవత్సరం జనవరి 14వ తేదీన నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించేసారని గుర్తు చేశారు.

ఇప్పుడు మళ్లీ హోం శాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చురకలు అంటించారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేయడం, గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడం కాదా ? అంటూ అమిత్ షాను నిలదీశారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని.. మండిపడ్డారు. అలాంటి బిజెపి... తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు రాలేదని తేల్చి చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పట్ల... మోడీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని కూడా సెటైర్లు పేల్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై.. కేంద్రం విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు.

Next Story