- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీవి నాటకాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీశ్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయంట్ ప్రజెంటేషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో హరీశ్ రావు పని చేశారని అన్నారు. మిషన్ కాకతీయతో పాటు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సృష్టించిన ఘనత వారిద్దరికే దక్కిందని తెలిపారు. నేటి పవర్ పాయింట్ చూస్తుంటే.. సీడబ్ల్యూసీ మాజీ సభ్యులు ఆర్.విద్యాసాగర్ గుర్తుకొస్తున్నారని కామెంట్ చేశారు.
కాంగ్రెస్‌వి నిందలు, దందాలు, చందాలు..
తెలంగాణకు సాగు నీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఆనాడు ‘నీళ్లు-నిజాలు’ అనే పుస్తకం ద్వారా వెలుగులో తీసుకొచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసి వాటిని ఫుల్‌ఫిల్ చేశామని అన్నారు. పాలముూరు-రంగారెడ్డితో పాటు సీతారామ ప్రాజెక్ట్‌లను 90 శాతం పూర్తి చేశామని అన్నారు. నేడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్ ఎక్కడో పోయిందని.. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాలు రాజ్యం నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు-కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు అన్న విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నాటకాలు ఆడుతున్నారని, నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని తెలిపారు. గుజరాత్‌లోని మార్బిలో పెద్ద వంతెనల కూలి 140 మంది చినిపోయినా.. ఎన్డీఎస్‌ఏ ఎందుకు పోలేదన్నారు. బిహార్‌లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి బ్రిడ్జిలు కూలుతున్నా అడిగే నాథుడే లేడని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి రూ.100 కోట్లు నష్టం వాటిల్లినా ఇదే ఎన్డీఎస్ఏ ఎక్కడికి పోయిందని అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినా.. నేటికి ఆ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరిస్తారా అన్న విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని అన్నారు.
ఆ రెండు పార్టీల తీరు సిగ్గుచేటు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు వంద సార్లు చెప్పారని.. కాళేశ్వరంలో వంద కంపోనెంట్లు ఉంటే ఒక్క బ్యారేజీ అని.. అందులో మూడు బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, 100 కి.మీ సొరంగ మార్గాలు ఉన్నాయని అన్నారు. ఆ వంద కంపోనెంట్లలో ఒక్కటి మేడిగడ్డ అని.. మూడు బ్యారేజీల్లో 371 పిల్లర్లు ఉంటే.. అందులో రెండు పిల్లర్లలో ఒకటి క్రాక్ వచ్చిందని అన్నారు. ఆ విషయాన్ని పట్టుకుని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ అంటే.. దుడ్డెను కట్టెయ్ అని బీజేపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బ్యారేజీ కుంగిన రెండు రోజుల్లోనే NDSA రిపోర్టు బీజేపీ ఆఫీసులో తయారు చేసి వండివార్చరని ఫైర్ అయ్యారు. కానీ, అనూహ్యంగా మేడిగడ్డతో పాటు పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీ ఎన్డీఎస్ఏ రిపోర్టును తిరస్కరిస్తున్నామని చెప్పడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టని అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు.






