- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండా సురేఖను అభినందించిన కేటీఆర్.. కమీషన్ మంత్రుల గురించి చెప్పినందుకే...?
మంత్రి కొండా సురేఖ నిన్న వరంగల్‌లో మంత్రులు డబ్బులు తీసుకోని ఫైల్స్‌పై సంతకం చేస్తారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మంత్రి కొండా సురేఖ నిన్న వరంగల్‌లో మంత్రులు డబ్బులు తీసుకోని ఫైల్స్‌పై సంతకం చేస్తారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే వీటిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్పందిస్తూ... ‘నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ "కమీషన్ సర్కార్" నడుస్తోంది. ఈ 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు, వారి సహచర మంత్రుల ప్రకారమే, భారీ కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టరని చెబుతున్నారు. ఆ మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని కొండా సురేఖని నేను కోరుతున్నాను అన్నారు. ఇంకా కేటీఆర్ ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించిన షాక్ తగిలింది. ఓవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసు.. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులను ఎదుర్కొంటుంటే తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అక్రమ మైనింగ్‌పై వంశీ మీద గన్నవరం పీఎస్‌లో గనుల శాఖ ఏడీ కంప్లైంట్ ఇచ్చారు. 58 పేజీలతో కూడిన ఫిర్యాదు చేశారు. అందులో 2019 నుంచి 2024 మధ్య కాలంలో వంశీ, ఆయనవర్గం చేసిన అక్రమ తవ్వకాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన సహజ వనరులను కొల్లగొట్టారని ఏడీ పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఇదంతా రికార్డు అవ్వటంతో ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మెక్సికోకు చెందిన 23 ఏళ్ల వలేరియా మార్క్వెజ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆమె గ్వాడలజారా నగరంలోని బ్యూటీ సెలూన్‌లో టిక్ టాక్‌లో తన ఫాలోవర్స్‌తో మాట్లాడేందుకు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించింది. వలేరియా లైవ్ ప్రారంభించి అందరికీ హాయ్ అని చెప్పగా ఇంతలోనే ఆమె శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
భారత్-పాకిస్తాన్‌ల మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ బడ్జెట్‌లో డిఫెన్స్ రంగానికి అదనంగా రూ.50 వేల కోట్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, పరిశోధనలపై దృష్టి సారించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.






