ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్‌కు కేటీఆర్ అభినందన

by velandi.Saikiran |

ఎంసెట్ 2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్‌కు కేటీఆర్ అభినందన
X

ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్‌కు కేటీఆర్ అభినందన

- లక్ష రూపాయల చెక్ అందజేత

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ 2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన చిలుకనగర్ డివిజన్‌కు చెందిన కొండల్‌రెడ్డి కుమార్తె మల్లాడి రుషికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.

రుషి విజయం చిలుకనగర్ డివిజన్‌తోపాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్ని అయినా అందుకోవచ్చని రుషి నిరూపించిందని కొనియాడారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థి అంకితభావం కలిసి విజయానికి పునాది అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story