Kondapochamma Sagar Incident : కొండపోచమ్మ సాగర్ మృతులకు కేటీఆర్ సంతాపం

by Muthe.Rajitha |   (  Updated:2025-01-11 14:03:26  IST  )

శనివారం కొండపోచమ్మ సాగర్లో(Kondapochamma sagar Accident) ప్రమాదవశాత్తూ మునిగి ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Kondapochamma Sagar Incident : కొండపోచమ్మ సాగర్ మృతులకు కేటీఆర్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : శనివారం కొండపోచమ్మ సాగర్లో(Kondapochamma sagar Accident) ప్రమాదవశాత్తూ మునిగి ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన ప్రగాఢ సానుభూతి(Condolences) తెలియజేశారు. యుక్త వయసులో యువకుల అకాల మరణం తనను తీవ్రంగా కాలచి వేసిందని అన్నారు. వారి కుటుంబాలకు కలిగే తీరని లోటును ఎవరు పూడ్చలేరు అని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంలో ఉన్న యువకుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. కాగా నేడు కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ దిగటానికి దిగి, ఏడుగురు యువకులు సాగర్లో పడి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు క్షేమంగా బయట పడగా.. మిగిలిన ఐదుగురు యువకులు మరణించారు.

Next Story