- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Formula E Car Race: కేటీఆర్ చిక్కులు! .. అప్రూవర్‍గా అర్వింద్ కుమార్?
ఫార్ములా ఈ రేస్ కేసులో అప్రూవర్‌గా మారే యోచనలో మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసు (Formula E Race) అంశం తెరపైకి వస్తోంది. ఈకేసులో ఈసారి సంచలనం నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఈ-కార్ రేస్ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించిన అర్వింద్ కుమార్ తాజాగా అప్రూవర్‍గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మరోసారి ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఇదే నిజం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు కష్టాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది.
కేటీఆర్‍కు చిక్కులు:
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్‍తో పాటు మరో ముగ్గురి పేర్లు నిందితుల జాబితాలో ఏసీబీ పేర్కొంది. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్‍కు గవర్నర్ అనుమతి ఇవ్వగా ఇటీవల అర్వింద్ కుమార్ ప్రాకిక్యూషన్‍కు కేంద్ర డీఓపీటీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‍ల ట్రాన్స్ ఫర్స్ లో అర్వింద్ కుమార్‍ను పక్కన పెట్టింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో అరవింద్ పై త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసి విచారణ జరపవచ్చనే ప్రచారం జరుగుతోంది. తన విషయంలో పరిస్థితిలు రోజు రోజుకు జఠిలం అయే అవకాశాలు ఉండటంతో ఇక అప్రూవర్‍గా మారేందుకు అరవింద్ కుమార్ ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం మేరకు అరవింద్ కుమార్ అప్రూవర్ అయితే కేటీఆర్ మెడకు మరిన్ని చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అధికారదుర్వినియోగం, నిబంధనలను అతిక్రమించటం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఏసీబీ విచారణలో తేల్చింది. వీటికి సంబంధించిన గుట్టు అంతా అరవింద్ కు తెలుసని ఆయన నోరు విప్పితే కేటీఆర్‍కు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.






