- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత బాసు ఆదేశాలు.. తెలంగాణలో టీడీపీని తెచ్చే కుట్ర.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రివా? ముఠా నాయకుడివా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. సీఎం గానే కాదు.. హోంమంత్రిగా కూడా ఉన్నావన్న సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా ? అని మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రివా? ముఠా నాయకుడివా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. సీఎం గానే కాదు.. హోంమంత్రిగా కూడా ఉన్నావన్న సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా ? అని మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటానికి కనీసం సిగ్గనిపించడం లేదా..? అని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు రాజ్యమేలడం తెలంగాణకు పట్టిన దరిద్రం అని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీజెండాపై చెక్కుచెదరని అభిమానాన్ని చూసి సీఎం మైండ్ బ్లాక్ అయినట్టు స్పష్టమవుతోందన్నారు.
ఇవాళ్టి సభతో తేలిపోయింది..
రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న మీకు పూర్తిగా మతిభ్రమించిందని ఇవాళ్టి సభ సాక్షిగా తేలిపోయిందన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసుశాఖ, రాష్ట్ర డీజీపీ, ఇవాళ ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి ఇవాళ అర్థమైపోయిందన్నారు. గత రెండేళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను కాలరాశారని ఇవాళ చేసిన ప్రకటనతో మీ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజవవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గడ్డపైకి టీడీపీ..
బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను నాలుగు కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందన్నారు. నీళ్ల నుంచి మొదలుకుని నిధులు, నియామకాల వరకూ తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్వీట్‌లో పేర్కొన్నారు.






