KTR : జూపల్లి పదవి ఊడటం ఖాయం : కేటీఆర్

by Muthe.Rajitha |

మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్ విసిరారు.

KTR : జూపల్లి పదవి ఊడటం ఖాయం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్ విసిరారు. త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli KrishnaRao) పదవి ఊడటం ఖాయమని జోస్యం చెప్పారు కేటీఆర్. ఇంతకీ ఏం జరిగిందంటే.. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తోంది అంటూ.. వాటికోసం నెలకు రూ.6500 కోట్లు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి.. ముఖ్యమంత్రి కేటీఆర్(CM KTR) అని నోరు జారారు. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని పలికారు. కాగా జూపల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనను ముఖ్యమంత్రి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. నా మాటలు గుర్తు పెట్టుకోండి జూపల్లి గారూ.. మీరు చేసిన ఈ తప్పుకు త్వరలోనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయం అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ వేదికగా సదరు వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అనుకోకుండా వచ్చిన ఆ మాటలపై కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే సీరియస్ గా తీసుకుంటుందా.. లేక చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది చూడాలి మరి.

Next Story