- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఎలక్షన్ కారు-బుల్డోజర్‌కు జరుగుతున్న యుద్ధం: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టడం కాదని, ఇల్లు కూలగొట్టడం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జుబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వేల ఇళ్లను కూలగొట్టారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టడం కాదని, ఇల్లు కూలగొట్టడం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జుబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వేల ఇళ్లను కూలగొట్టారని చెప్పారు. ఈ ఎన్నికలు జరుగుతున్నది బీఆర్ఎస్ కారుకు.. కాంగ్రెస్ బుల్డోజర్ కు మధ్య జరుగుతుందని వ్యాఖ్యానించారు. కారు గెలిస్తేనే మీ ఇళ్లపైకి బుల్డోజర్ రాదని అన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మిమ్మల్ని కాపాడేవాళ్లు ఉండరని హెచ్చరించారు. లేదంటూ ఇరుకు గల్లీల్లో ఉన్న ఇళ్లపైకి బుల్డోజర్ ఎప్పుడు వస్తుందో ఎవరి ఇళ్లు కూలుస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలేదు.. ఒక్క ఇటుక పెట్టలేదు కానీ ఎన్నో ఇళ్లు కూలగొట్టారని వ్యాఖ్యానించారు. కత్తి కాంగ్రెస్ కు ఇచ్చి బీఆర్ఎస్ ను యుద్ధం చేయాలంటే కష్టం అని అన్నారు. కాబట్టి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.






