- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఏ తప్పూ చేయలేదు.. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి: సర్కార్‌కు కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case)లో నేను ఏ తప్పూ చేయలేదని అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని కీలక ప్రకటన చేశారు. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అని సవాల్ చేశారు. లగ్జరీ కార్ల కేసు(Luxury Cars Case)లోనూ విచారణకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తమ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని అన్నారు. అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి అనాలోచితంగా ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు. ఆయన తలచుకుంటే ఇప్పటికే ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యేది. భూసేకరణ ఇబ్బంది కూడా లేదు. ఎయిర్‌పోర్టు మెట్రో కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరింది. అందుకు రేవంత్‌రెడ్డి ఒప్పుకోలేదు. అప్పటి నుంచే సీఎం, ఎల్ అండ్ టీ మధ్య గొడవ మొదలైంది. రేవంత్ వైఖరి వల్లే ఆ సంస్థ వెళ్లిపోతోందని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.






