- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇక వదిలిపెట్టను.. క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా’: CM రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్
ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. డ్రగ్స్ కేసు(Drug Case)తో నాకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. పోని నా మీద ఏమైనా డ్రగ్స్ కేసులు ఉన్నాయా? అని అడిగారు. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేరుగా నా ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేక.. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి చిట్‌చాట్లు చేస్తున్నారని విమర్శలు చేశారు. చిట్‌చాట్‌లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ రెడ్డికి కొత్త కాదని అన్నారు. ఇక ఈ అంశాన్ని వదిలిపెట్టను.. తప్పకుండా రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతా అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తప్పుడు ఆరోపణలకు రేవంత్ రెడ్డి తప్పకుండా మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని.. రేవంత్ రెడ్డి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
కాగా, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోంది. విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నారు అని చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. నిరూపించాలని సవాల్ చేస్తూ ట్వీట్ పెట్టారు.






