- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియంతృత్వం లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలి : కేటీఆర్
తెలంగాణలో మరోసారి అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలని, నియంతృత్వం లేని ప్రజాస్వామిక పాలన రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆకాంక్షించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరోసారి అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలని, నియంతృత్వం లేని ప్రజాస్వామిక పాలన రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆకాంక్షించారు. తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (National Unity Day) పురస్కరించుకుని కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక రాజ్యం వచ్చేంతవరకూ కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. గ్రూప్ -1 అభ్యర్థులు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నా.. నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారని, ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నామని వాపోయారు.
రైతులు యూరియా దొరక్క అల్లాడిపోతుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా ఒలింపిక్స్ గురించి చర్చలు చేస్తున్న నీతిమాలిన ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఇలాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదిరించి, ఎదురొడ్డి నిలబడి.. తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో, అభివృద్ధి బాటలో కేసీఆర్ నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్దామని తెలిపారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఈ రోజును తాము సమైక్యతా దినోత్సవంగానే పాటిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంత వరకూ బీఆర్ఎస్ ఉంటుందని మరోసారి నొక్కి చెప్పారు.






