- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌రెడ్డి పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతుండు : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాకర్షక పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాకర్షక పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ గతం గురించి మాట్లాడితే.. తాము కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతిపై బరాబర్ మాట్లాడతామని అన్నారు. గతంలో సీఎంలుగా చేసిన వారు పలు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పార్టీలు మారాడని, అయితే అందులో తప్పుపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం మానేయ్యాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సీఎం కలవొద్దు అనే రూల్ లేదని, ఒకవేళ కలిసినా అందులో తప్పేముందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ సీఎం కలవడానికి వచ్చేవారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న స్నేహపూరిత సంప్రదాయాన్నే నేడు సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించడం అభినందనీయమని జగ్గారెడ్డి అన్నారు.






