ప్రవీణ్ కుటుంబసభ్యులకు KTR ఫోన్

by Gantepaka Srikanth |

అమెరికా(America)లో మరోసారి కాల్పులు(Firing) కలకలం రేపాయి.

ప్రవీణ్ కుటుంబసభ్యులకు KTR ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో మరోసారి కాల్పులు(Firing) కలకలం రేపాయి. గురువారం ఓ గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్‌ (27) మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. MS చదివేందుకు అమెరికా వెళ్లిన ప్రవీణ్.. అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడి ఇంటికి సమీపంలోని బీచ్‌లో ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ప్రవీణ్(Praveen) మరణించాడు. దీంతో అక్కడి అధికారులు ప్రవీణ్ ఇంటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ప్రవీణ్‌ ఎంఎస్‌ సెకండియర్‌ చదువుతున్నట్లు సమాచారం. కాగా, కుమారుడిని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న కుటుంబాన్ని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఓదార్చారు. గురువారం సాయంత్రం ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రవీణ్‌ను దుండగులు హతమార్చడం పట్ల కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Next Story