- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : చేవేళ్లలో కేటీఆర్ రైతు దీక్ష ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల(Election Promises)అమలులో మోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ చేవేళ్లలో తలపెట్టిన రైతు దీక్ష(BRS Rythu Deeksha) ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల(Election Promises)అమలులో మోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ చేవేళ్లలో తలపెట్టిన రైతు దీక్ష(BRS Rythu Deeksha) ప్రారంభమైంది. రైతు దీక్షకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై పలువురు మహిళలకు, రైతులకు ప్రశ్నలు సంధించారు.
తులం బంగారం వచ్చిందా అని కేటీఆర్ చెన్నమ్మ అనే మహిళను ప్రశ్నించగా.. 54వేల రుణమాఫీ కాలేదని..తులం బంగారం రాలేదని..4వేల పింఛన్ లేదని..కేసీఆర్ ఇస్తున్న 2వేల పింఛన్ వస్తుందని సమాధానం చెప్పింది. గ్యాస్ రాయితీ రూ.500పడుతలేవని, 4ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం లేదని చెప్పింది. మరి ఎన్నికల్లో ఇస్తామని ఇవ్వనోళ్లను అడుగవా అని కేటీఆర్ ఆ మహిళను ప్రశ్నించగా.. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండోనని..పుల్ల గీరి అంటు పెట్టాల్సిందేనని ఘాటుగా సమాధానమిచ్చింది.
మీ చేవెళ్ల జనాలు చాలా వాయిలెంట్ ఉన్నారని..ఇట్లా మాట్లాడితే కేసులు పెడుతారని ప్రభుత్వం తీరుపై కేటీఆర్ వంగ్యోక్తులు విసిరారు. ఆడోళ్లకు ఫ్రీ బస్ అని చెప్పి ఇజ్జత్ లేకుండా చేశాడని..మగ పిల్లలు లేనిది ఆడ పిల్లలు ఎక్కడని ఆ మహిళ ప్రశ్నించింది. వామ్మో నీవు లాజిక్ తో కొడుతున్నావని, రేవంత్ రెడ్డి ఏడన్న కనిపిస్తే నీ మాటలు చెబుతానని..కాని ఆయన తప్పించుకు తిరుగుతున్నాడని కేటీఆర్ చెప్పగా..ఈ సారి మిమ్మల్నే మళ్లా గెలిపిస్తామని ఆ మహిళా సమాధానమివ్వగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
రత్నమ్మ అనే మరో మహిళ తమ అర ఎకరం భూమి వివాదంలో అధికారులు తిప్పలు పెడుతున్నారని..5వేల రుణమాఫీ అయ్యిందని, మళ్లా కొత్త రుణం తీసుకున్నానని, మా ఊరికి బస్సు లేదని చెప్పింది. రైతు దీక్షలో మాజీ మంత్రులు సబీతా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సహా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.






