- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆర్ధిక మంత్రిపై ప్రివేలేజ్ మోషన్
అసెంబ్లీ సమావేశాల(Assembly Sessions) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల(Assembly Sessions) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క(Finance Minister Bhatti Vikramarka)పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress government) ప్రివిలేజ్ మోషన్(Privilege Motion) ప్రవేశపెట్టాలని తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ(RBI) ఇచ్చిన నివేదిక(Report) గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
దీనిపై ఆయన.. మొత్తం రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లు అని చెబుతూ శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పు 3.89 లక్షల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. అలాగే అప్పులపై ఆర్ధిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్'' పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందని తెలిపారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందని అన్నారు. అంతేగాక ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని, కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.






