- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా సవరణలో కేటీఆర్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి నివాసంలో మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు సైతం తమ వివరాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, అక్రమ ఓట్ల తొలగింపు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని తెలంగాణలో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఎల్‌వోలకు వివరాలు సమర్పిస్తున్నారు.
Next Story






