KTR: ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది

by Gantepaka Srikanth |

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరిసిల్ల నియోజకవర్గం, అడవి పదిరకు చెందిన ఆటో డ్రైవర్‌ సతీశ్‌ను బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు.

KTR: ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరిసిల్ల నియోజకవర్గం, అడవి పదిరకు చెందిన ఆటో డ్రైవర్‌ సతీశ్‌ను బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబానికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కి రూ.24 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలన్నీ, డ్రైవర్లందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు(Auto Drivers) ఎవరూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది. కష్టం వచ్చిన ఆటో డ్రైవర్ అన్నల వెంబటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని కేటీఆర్ భరోసా కల్పించారు. ట్వీట్

Next Story