- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 11న తమిళనాడులోని కోయంబత్తూరు కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనున్న 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE - Fraternity of Mechanical and Automotive Engineers) నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (FMAE) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా 101 కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృందాలు, మొత్తం 1300 మందికి పైగా యువ ఇంజినీర్లు పాల్గొననున్నారు. విద్యార్థులు తమ స్వయంగా రూపొందించిన వాహనాలు, వినూత్న ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయిలోని అగ్రగామి ఆటోమోటివ్ కంపెనీలకు చెందిన 25 మంది నిపుణుల జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేయనున్నారు. ఆహ్వానం






