KTR: ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్

by Ramesh Goud |

జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్(National Award Winner) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్(Arrest) పాలకుల అభద్రతకు పరాకాష్ట! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.

KTR: ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్(National Award Winner) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్(Arrest) పాలకుల అభద్రతకు పరాకాష్ట! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్(Sandhya Thietre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా "అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడు" అని ఉన్న ప్రత్యేక పోస్ట్ పెట్టారు.

దీనిపై తొక్కిసలాట బాధితుల పట్ల తనుకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ ఈ ఘటనలో నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని ప్రశ్నించారు. అంతేగాక ప్రత్యేకించి అల్లు అర్జున్ నేరుగా బాధ్యత వహించని విషయానికి ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం సరికాదన్నారు. మర్యాద, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ పరిధి ఉంటుందని, ప్రభుత్వ అత్యున్నత ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇక అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌(Hyderabad)లో హైడ్రామా(Hydrama) చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అరెస్ట్ చేయాలని కేటీఆర్ రాసుకొచ్చారు.

Next Story