BRS: కవిత, మల్లన్న ఇష్యూపై ఏం చేద్దాం? కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ!

by Prasad Jukanti |

కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయ్యారు.

BRS: కవిత, మల్లన్న ఇష్యూపై ఏం చేద్దాం? కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ పొలిటికల్ హీట్ గా మారింది. మల్లన్న వ్యాఖ్యలను నిరసనగా నిన్న మల్లన్న కార్యాలయంపై జాగృతి శ్రేణుల దాడి నేపథ్యంలో తాజాగా నందినగర్ లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,(KTR) ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచరుల దాడి ఘటన పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కానీ, మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేసిన అంశంపై కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. ఇటీవల బీఆర్ఎస్ తో కవితకు పొసగడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అందువల్లే కవిత విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ ఆసక్తిగా మారింది. మల్లన్న వర్సెస్ కవిత విషయంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతునదనేది ఉత్కంఠ రేపుతోంది.

కవితపై మల్లన్న మరోసారి విమర్శల దాడి:

మరో వైపు మల్లన్న తన డోస్ పెంచారు. ఇవాళ క్యూ న్యూస్ లో మార్నింగ్ విత్ మల్లన్న ప్రోగ్రామ్ లో కవిత పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచం పొత్తు- మంచం పొత్తు అనే పదం తెలంగాణలోని సామాన్య ప్రజల వాడుకలోని ఉపయోగించే పదమేనని ఈ పదాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2017లో తెలుగు అకాడమీ ముద్రించిన ఈ సామెత ప్రస్తావన ఉందని ఈ పుస్తకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు సందేశం కూడా రాశారని మల్లన్న అన్నారు. ఈ పదం తెలంగాణలో ఉందో లేదో కవిత వెళ్లి తన తండ్రిని అడగాలన్నారు. ఈ సందర్భంగా ఘాటు పదాలతో కవితపై విరుచుకుపడ్డారు.

Next Story