KTR: అన్నీ అబద్ధాలు.. అర్థ సత్యాలు: గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-12 07:50:46  IST  )

గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు.. అర్థ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు.

KTR: అన్నీ అబద్ధాలు.. అర్థ సత్యాలు: గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు.. అర్థ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగంపై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ (Gandhi Bhavan) కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం మించి ఎక్కడా రైతు రుణమాఫీ లేదని అన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో పచ్చి అబద్ధాలు చెప్పించారని ధ్వజమెత్తారు. రైతు బంధు మొత్తం అందిందంటూ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రం అవుతోందని.. సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండుతున్నాయని ఆక్షేపించారు.

కేసీఆర్‌పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. ఇటీవలే 20 శాతం కమీషన్‌ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పుల చేస్తే.. రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష 13 వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్ అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం బాధాకరమని ఫైర్ అయ్యారు. లక్షన్నర కోట్ల అప్పు చేసి ఒక్క పథకం కూడా ప్రారంభించని సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్క హామీ అమలు చేయకుండా రూ.లక్ష 62 వేల కోట్లు అప్పులు చేసిన రేవంత్ సర్కార్‌ను గవర్నర్ మందలిస్తారని అనుకున్నామని అన్నారు. దావోస్‌లో రూ.లక్ష 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధం చెప్పించారని కేటీఆర్ ఆరోపించారు.

Read More..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

Next Story