- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఆ ఎన్నికల తర్వాత ‘రైతు భరోసా’ బంద్ అవ్వడం పక్కా.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక నల్గొండ (Nalgonda)కు ఐటీ కళ తప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక నల్గొండ (Nalgonda)కు ఐటీ కళ తప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ ఐటీ టవర్ (Nalgonda IT Tower) తాగుబోతులకు అడ్డాగా మారిందని అన్నారు. అదేవిధంగా స్కూళ్లలో పిల్లలకు గొడ్డు కారం పెట్టే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. బండినెక బండి కట్టి అంటూ నైజాం సర్కార్ (Nizam Sarkar)ను నిలదీసిన గడ్డ.. నల్గొండ అన్ని అన్నారు. పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేదని ఫ్లోరైడ్ భూతంపై కేసీఆర్ (KCR) స్వయంగా పాట రాశారని గుర్తు చేశారు. నల్గొండకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని అన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Raithu Bharosa) డబ్బులు టకీ.. టకీమని పడతాయని అన్నారని.. మరి పడ్డాయా అని జనాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ 12 సార్లు రైతు బంధు ఇచ్చారని.. కానీ ఇలా ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని గుర్తు చేశారు.
పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అంటున్నారని కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందుక ఒకసారి రైతుబంధు ఇచ్చారని.. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే పథకాలు మళ్లీ అటకెక్కడం ఖాయమని కామెంట్ చేశారు. ఏ గ్రామంలో అయినా 100 శాతం రుణ మాఫీ అయినట్లుగా నిరూపిస్తే.. రాజీనామా చేస్తానంటూ రేవంత్‌కు సవాల్ చేశానని అన్నారు. ఆరోగ్య శ్రీ (Aarogya Sri)అంటే వైఎస్ఆర్ (YSR).. రైతు బంధు (Raithu Bandhu) అంటే కేసీఆర్ (KCR) గుర్తు వస్తారని తెలిపారు. కేసీఆర్‌ను ప్రజలకు గుర్తుకు రాకుండా చేసేందుకే రైతుబంధును ఆపేశారని ఆరోపించారు. రుణ మాఫీ కాలేదు కాబట్టే గ్రామ సభల్లో రైతులు నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని రూ.12 ఇస్తామంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక్కో ఎకరానికి రూ.17,500 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని.. ఓట్ల కోసం వచ్చినప్పుడు రుణమాఫీ, బోనస్, రైతు భరోసాపై నిలరదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.






