- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KRMB Meeting: కాసేపట్లో కేఆర్ఎంబీ సమావేశం.. కొలిక్కి రానున్న నీటి వాటాల అంశం!
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) చైర్మన్ అతుల్ జైన్ (Chairman Atul Jain) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)లోని జలసౌధ (Jalasoudha)లో ఇవాళ మరోసారి సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) చైర్మన్ అతుల్ జైన్ (Chairman Atul Jain) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)లోని జలసౌధ (Jalasoudha)లో ఇవాళ మరోసారి సమావేశం జరగనుంది. అయితే, బుధవారం నిర్వహించిన మీటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నీటి పారుదల శాఖ అధికారులు హాజరుకాకపోవడంతో సమావేశానికి నేటికి వాయిదా వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ఇరిగేషన్ అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ (KRMB Chairman Atul Jain) భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులపైనే ప్రధానంగం చర్చించనున్నారు. మల్యాల (Malyala), పోతిరెడ్డిపాడు (Pothireddypadu), ముచ్చిమర్రు (Muchimarru) నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపును ఆపాలని తెలంగాణ (Telangana) అధికారులు బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించనున్నారు.
ఇక సాగర్ రైట్ కెనాల్ (Sagar Right Canal) నుంచి నీటి విడుదలను వెంటనే నిలిపివేయించాలని కోరనున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project)లో ఉన్న నీటిని ముట్టుకోవద్దని తెలంగాణ అధికారులు బోర్డుకు విన్నవించనున్నారు. ఏపీ నుంచి అధికారులు నేటి సమావేశానికి హాజరైతే నీటి వాటాల అంశం ఓ కొలిక్కి రానున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం నుంచి సమావేశానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ, తదితరులు హాజరు కానున్నారు.






