కేఆర్ఎంబీ సమావేశం ఆకస్మిక వాయిదా: జలసౌధలో జరగాల్సిన భేటీ రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 17:33:06  IST  )

హైదరాబాద్ జలసౌధలో జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది.

కేఆర్ఎంబీ సమావేశం ఆకస్మిక వాయిదా: జలసౌధలో జరగాల్సిన భేటీ రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం నిర్వహించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేఆర్ఎంబీ అధికారులు అధికారికంగా సమాచారం విడుదల చేశారు. అయితే, ఈ సమావేశాన్ని ఏ కారణాల వల్ల వాయిదా వేశారన్న విషయంపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా, తదుపరి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీని కూడా ప్రకటించలేదు. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంది. అకస్మాత్తుగా సమావేశం వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో పంపిణీ అంశాల పరిష్కారానికి మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తోంది.

Next Story