ఆర్థిక సమస్యల వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Malleboina Mahesh |

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆర్థిక సమస్యల వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య (Gunman Krishna Chaitanya) ఆత్మహత్యాయత్నం (suicide attempt) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం తన నివాసంలో కానిస్టేబుల్ చైతన్య ఈ దారుణానికి పాల్పడగా.. ప్రస్తుతం కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తన గన్ మెన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆస్పత్రి వద్దకు చేరుకొని అతని పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక సమస్యల (Financial problems) వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈరోజు ఉదయం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి (LB Nagar Kamineni Hospital)లో కానిస్టేబుల్ చైతన్యను తాను కలిశానని, అతని పరిస్థితి విషమంగా ఉందని, బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలిసిందని అన్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని, 3 నెలల క్రితం కుటుంబ సమస్యలతో గొడవల వల్ల కృష్ణ చైతన్య ఇంటి నుండి వెళ్లిపోయాడని, అప్పటి నుండి కృష్ణ చైతన్య నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు తెలిపారు.

Next Story