Koushik Reddy: ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది.. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) తమను వేధిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (MLA Koushik Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

Koushik Reddy: ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది.. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) తమను వేధిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (MLA Koushik Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బంజారా‌హిల్స్ (Banjara Hills) ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఇవాళ ఆయన మాసబ్ ట్యాంక్ (Masab Tank) పోలీస్ స్టేషన్‌కు న్యాయవాదితో సహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు గత నెల 4న బంజారా‌హిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు ముందు అపాయింట్‌మెంట్ (Appointment) కూడా తీసుకున్నానని పేర్కొన్నారు. తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా సీఐ (CI) తన ఫిర్యాదును స్వీకరించలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వాన్ని తాను నిలదీస్తున్నందుకే తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడుతున్నందుకే మమ్మల్ని వేధిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని కౌశిక్ రెడ్డి అన్నారు.

Next Story