Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పీఎస్‌లోనే వైద్య పరీక్షలు..

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-14 03:04:13  IST  )

ఎమ్మెల్యే సంజయ్‌ (MLA Sanjay)పై దాడి కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Koushik Reddy)ని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పీఎస్‌లోనే వైద్య పరీక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్/కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ (MLA Sanjay)తో ఘర్షణ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Koushik Reddy)ని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి (Koushik Reddy) రాత్రి మొత్తం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి వైద్యులను పీఎస్‌కే పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ మేరకు అల్పాహారం చేశాక ఇవాళ ఉదయం 9 గంటలకు కరీంనగర్ (Karimnagar) రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్‌రెడ్డిని హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జైలుకు వెళ్తారా.. లేక బేయిల్ వస్తుందా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)పై వన్‌ టౌన్‌లో మూడు, త్రీ టౌన్‌లో రెండు చొప్పున మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆర్డీవో మహేశ్వర్ (RDO Maheshwar), ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు పోలీసులు కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, రాత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే ఉండటంతో బీఆర్ఎస్ (BRS) నేతల అరెస్ట్‌ల పర్వం కొనసాగింది.

Next Story