Koushik Reddy: కమలాపూర్‌లో తీవ్ర ఉద్రికత్త.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-24 07:12:18  IST  )

హనుమకొండ (Hanmakonda) జిల్లాలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Koushik Reddy: కమలాపూర్‌లో తీవ్ర ఉద్రికత్త.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమకొండ (Hanmakonda) జిల్లాలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కమలాపూర్ (Kamalapur) గ్రామ పరిధిలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy) హాజరయ్యారు. అనంతరం ఆయన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పథకాలపై మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆగ్రహించిన కాంగ్రెస్ (Congress) నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

దీంతో విచక్షణ కోల్పోయిన.. కౌశిక్ రెడ్డి ‘ఇజ్జత్ ఉండాలే.. సిగ్గుండాలి.. నా మోచేతి నీళ్లు తాగి, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేస్త్రుండ్రు’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నాయకులు మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టామాటాలు, కోడి గుడ్లతో దాడి చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy) గన్ మెన్లు ఆయనను వేదిక మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులను చెదరగొట్టారు.

Next Story