- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షరం ముక్క రాని రైతు యూరియా యాప్ ఎలా వాడతాడు? అసెంబ్లీలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్న
by Muthe.Rajitha |
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. ఇందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాళీ కీలక ప్రశ్నలు అడిగారు. ప్రభుత్వం ఇటీవల యూరియా పంపిణీ కోసం ప్రవేశ పెట్టిన యూరియా యాప్ పై మాట్లాడుతూ.. అక్షరం ముక్క రాని రైతుకు స్మార్ట్ ఫోన్లో యూరియా యాప్ వాడటం ఎలా తెలుస్తుందని అన్నారు. తక్షణమే ఆ పద్ధతి తొలగించాలని అన్నారు. అలాగే వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు వేసంగి నాట్ల సమయంలోనే సరిగా కరెంట్ ఇవ్వకపోతే ఇక తర్వాత పంట చేతికి దశకి పంటలు ఎండిపోయే పరిస్థితి తెచ్చేలా ఉన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన జలాశయాలకు సంబంధించిన కాలువల్లో పూడికలు తీయడం లేదని, మరమ్మతులు గాలికి వదిలేశారని పేర్కొన్నారు.
Next Story






