- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తకోట కురుమూర్తి స్వామి సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతా.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కొత్తకోట మండలం కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేసిన ప్రజలకు కచ్చితంగా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కాగా, 5 గ్యారెంటీలపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తప్పకుండా అమలు చేసి తీరుతానని గొంతెత్తి చెప్పుకొచ్చారు. ఈ కొత్తకోట గడ్డమీదుండి మాట ఇస్తున్నా.. కొత్తకోట కురుమూర్తి స్వామి సాక్షిగా ఆగస్ట్ 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని వెల్లడించారు. దేవుడంటే నమ్మకం ఉంది.. దైవం అంటే భక్తి ఉంది. కాబట్టి పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా మరోసారి రుణమాఫీ విషయం తీసుకొచ్చి ప్రజలకు హామీ ఇచ్చారు.
Next Story






