- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? అమలు చేసినవి ఎన్ని?
మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టి, డైవర్షన్ రాజకీయాలనే ఏకైక ఎజెండాగా మార్చుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? అమలు చేసినవి ఎన్ని? మీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి? డైవర్షన్ డ్రామాలు ఏంటి? అన్నింటిపైనా బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సవాల్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలతో కాదని.. అభివృద్ధితోనే ప్రజల విశ్వాసం గెలవాలని.. లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టి, డైవర్షన్ రాజకీయాలనే ఏకైక ఎజెండాగా మార్చుకున్నారని ఆరోపించారు. పంచాయతీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు రేవంత్ ప్రచారంలో కనిపించింది కేసులు, నోటీసులు, లీకులు తప్ప అభివృద్ధి కాదని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చూపించడానికి ఒక్క రోడ్డు, ఒక్క పరిశ్రమ, ఒక్క సంక్షేమ పథకం కూడా లేకపోవడంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును టార్గెట్ చేశారని ఆరోపించారు. అభివృద్ధిపై చర్చకు రావాల్సిన ప్రభుత్వం, కాళేశ్వరం సీబీఐ విచారణ అంటూ మరో డైవర్షన్ తెరపైకి తెచ్చి, ఎన్నికల హామీల అమలులో జరిగిన ఘోర వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడిచినా ఒక్క ఇటుక కూడా పెట్టలేని ప్రభుత్వం, హైడ్రా పేరుతో ప్రజల ఇళ్లపై, వ్యాపారాలపై, జీవనాధారాలపై దాడి చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఇది పాలన కాదని, అధికార అహంకారంతో సాగుతున్న విధ్వంసమని అన్నారు. ఈ డైవర్షన్ రాజకీయాలకు బీజేపీ పరోక్ష మద్దతు ఇవ్వడం మరింత సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయకుండా కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు.






