ఏక పక్షంగా చంపి ఎన్‍కౌంటర్ అంటారా?.. బండి వ్యాఖ్యలకు కూనంనేని రియాక్షన్

by Prasad Jukanti |

హిడ్మాను కొట్టి చంపి దానికి ఎన్‍కౌంటర్ అనే అందమైన పేరు పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని విమర్శించారు.

ఏక పక్షంగా చంపి ఎన్‍కౌంటర్ అంటారా?.. బండి వ్యాఖ్యలకు కూనంనేని రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టుల వరుస ఎన్‍కౌంటర్లపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonanneni Sambasivarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిడ్మాను కొట్టి చంపి దానికి ఎన్‍కౌంటర్ (Hidma Encounter) అనే అందమైన పేరు పెడుతున్నారని విమర్శించారు. ఎన్‍కౌంటర్ అంటే పరస్పర కాల్పులు జరగాలి కదా అని ప్రశ్నించారు. ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)ఎన్‍కౌంటర్ అంటున్నారని విమర్శించారు. మావోయిస్టులతో చర్చించి సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి చంపుతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హిడ్మా దంపుతుల ఎన్ కౌంటర్ బూటకం అన్న ఆయన.. 2026 మార్చి 30 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని అమిత్ షా ప్రకటించారని అంతం చేయడానికి ఇదేమైనా యుద్ధమా అని ప్రశ్నించారు. కాల్పులు విరమించుకుంటున్నామని ప్రకటించినా చంపుతున్నారని, దండకారణ్యంలోని ఖనిజాల కోసమే మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. ఎన్‍కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్టులు మౌనంగా ఉండకూడదని సుమోటోగా స్వీకరించాలన్నారు. మావోయిస్టుల ఎన్‍కౌంటర్లను తక్షణమే ఆపివేయాలని ఎన్ కౌంటర్లపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. మావోయిస్టుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మోడీ పాలనలో ఆటవిక విధానాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.

Next Story