Koneru Konappa : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కోనేరు కోనప్ప

by Y. Venkata Narasimha Reddy |

సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Allola Indrakaran Reddy)తో కలిసి కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు.

Koneru Konappa : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కోనేరు కోనప్ప
X

దిశ, వెబ్ డెస్క్ : సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Allola Indrakaran Reddy)తో కలిసి కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ మార్పు విషయమై కోనప్ప స్పందించారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లుగా.. బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా జరిగిన ప్రచారాన్ని కోనప్ప ఖండించారు. చివరి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కోనప్ప ప్రకటించారు.

ఒక రోజు క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియాకు లీక్ ఇచ్చిన కోనప్ప అనూహ్యంగా యూటర్న్(U-turn)తీసుకుని మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయవర్గాలను విస్మయ పరిచింది. కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఇది ఇలా ఉండగా..కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇదే ఎన్నికల్లో తనపై బీఎస్సీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో. అసంతృప్తికి గురైన కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరారు.

గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిన విబేధాలు..తను రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను క్యాన్సిల్ చేయడం వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే యూటర్న్ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Next Story