- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగర నడిబొడ్డులో రేవ్ పార్టీల హల్‌చల్.. కొండాపూర్‌లో 11 మందిపై కేసు, 9 మంది అరెస్ట్
ఇన్నాళ్లు నగర శివార్లకు పరిమితమైన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు నగరం నడిబొడ్డుకు పాకాయి.

దిశ, శేరిలింగంపల్లి : ఇన్నాళ్లు నగర శివార్లకు పరిమితమైన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు నగరం నడిబొడ్డుకు పాకాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో మద్యం, మటన్ విందులు. డ్రగ్స్ వినియోగాలు అమ్మాయిల అర్ధనగ్న నృత్యాలు, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న కొన్ని ముఠాలు విష సంస్కృతిని యువతపై రుద్దుతున్నాయిమ్ వాటికి అలవాటు పడిన యువత తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా కొండాపూర్ లో ఇలాంటి రేవ్ పార్టీ నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కొండాపూర్ లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని ముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇలాంటి రేవ్ పార్టీని శనివారం రాత్రి స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బిటీం ఎస్సై సంధ్య, బాలరాజు ఇతర సిబ్బంది కలిసి దాడి చేసి భగ్నం చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మారుపేరులతో మరో బ్యాంక్ అకౌంట్ తో, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న బడాబాబులను నగరానికి తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళుతుంటారు.
ఇలాంటి ముఠాను పక్కా సమాచారంతో ఎస్టిఎఫ్ బి టీం పట్టుకుంది. వీరందరినీ శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ సిఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2.080 కేజీల గంజాయిని, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ ను, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు కార్లను, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్, డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అశోక్ కుమార్, ఆర్గనైజర్ సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్ శ్రీ దత్, సమత, తేజలను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






