పిల్లల కోసం వెళితే శవమై తిరిగి వచ్చింది.. కొండాపూర్ ప్లాన్ బీ ఆస్పత్రిలో మహిళ మృతి

by Bhanu |

కొండాపూర్ ప్లాన్ బీ ఫర్టిలిటి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల కోసమని ఆస్పత్రికి వెళితే.. తిరిగి శవమై వచ్చింది.

పిల్లల కోసం వెళితే శవమై తిరిగి వచ్చింది.. కొండాపూర్ ప్లాన్ బీ ఆస్పత్రిలో మహిళ మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : కొండాపూర్ ప్లాన్ బీ ఫర్టిలిటి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల కోసమని ఆస్పత్రికి వెళితే.. తిరిగి శవమై వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన పల్లవి (29)కి గత నాలుగేళ్ల క్రితం పెళ్లి అయినా సంతానం కలగకపోవడంతో కొండాపూర్ లోని ప్లాన్ బీ ఫర్టిలిటీ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు ప్లాన్ బీ ఫర్టిలిటి హాస్పిటల్ చేర్పించారు.


అయితే ఆస్పత్రిలో డాక్టర్లు పల్లవిని పరిశీలించి గర్భ సంచిలో నీటి బుడగలు ఉన్నాయని, సర్జరీ చేయాలనీ సూచించారు. కొద్ది సమయం తర్వాత సర్జరీ సక్సెస్ అయిందని మృతురాలు కుటుంబ సభ్యులకు చెప్పి బిల్లు కట్టించుకున్నారు. కాసేపటి తర్వాత పల్లవి గుండెపోటుతో చనిపోయిందంటూ ప్లాన్ బీ ఫర్టీలిటీ సెంటర్ డాక్టర్లు మృతురాలు బంధువులకు తెలిపారు. దీంతో పల్లవి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story