- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రూ.35.19 కోట్ల టీటీడీ (TTD) నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయంలో వసతులు కల్పించాలని తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకు టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమష్టిగా నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన మంచి మనసుతో దైవ కార్యక్రమానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందని, అదేవిధంగా కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.






