- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: ప్లీజ్ దేవుడా ఈసారి ఆర్సీబీ కప్ కొట్టాలి.. కొండగట్టు అంజన్నా హుండీలో అభిమాని చీటీ
. కొండగట్టు అంజన్నా హుండీలో అభిమాని చీటీ వేయడం వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఐపీఎల్ సీజన్ 18లో (IPL -2025) ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకుపోవడంతో టీమ్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తమకు కలగా మారిన ట్రోఫీని ముద్దాడేందుకు ఆర్సీబీ ఇంకో అడుగు దూరం మాత్రమే ఉండటంతో ఈసారి అంతా మంచే జరగాలని ఫ్యాన్స్ దేవుళ్లకు మొక్కులు, సోషల్ మీడియాలో చాలెంజ్‌లు చేస్తూ ఫైనల్‌పై ఉత్కంఠను పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఆర్సీబీ (RCB) కప్పు కొట్టాలని తాజాగా ఓ అభిమాని కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) హుండీలో చీటీ రాసి వేశాడు. ‘ప్లీజ్ గాడ్.. దిస్ ఇయర్ ఆర్సీబీ వన్ ద ట్రోఫీ.. ఈ సాలా కప్ నమదే’ అంటూ చీటీపై పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గెలవకపోతే విడాకులిస్తా...
గత గురువారం పంజాబ్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ ఈసారి ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా అంటూ ప్లకార్డును స్టేడియంలో ప్రదర్శించింది. దానిపై కింగ్ కోహ్లీ హ్యాష్ ట్యాగ్‌ను సైతం జోడించింది. ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానుల ఆశల నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ అదృష్టం ఎలా ఉందో అనేది వచ్చే నెల 3వ తేదీన తేలనుంది.






