నా ఫోన్, నా భార్య ఫోన్ ట్యాప్ చేశారు.. సిట్ విచారణ తర్వాత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరయ్యారు.

నా ఫోన్, నా భార్య ఫోన్ ట్యాప్ చేశారు.. సిట్ విచారణ తర్వాత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (phone tapping case) ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (SIT investigation) సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసులో భాగంగా తనను సిట్ అనేక ప్రశ్నలు వేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు నాలుగు అంశాలు చెప్పినట్లు వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారలను ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల ప్రైవసీకి భంగం కలిగించి రాజీకీయాల కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు వెల్లడించారు. అభద్రతా భావంతోనే తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక నా ఫోన్ ట్యాప్ చేశారని అనుమానం వచ్చిందని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని తెలిపారు. వారెంట్ లేకుండా నా ఆఫీస్ లోకి కొందరు దౌర్జన్యంగా వచ్చి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. నా ఫోను, నా భార్య ఫోను ట్యాప్ చేసి బెదిరించారని అన్నారు. గత ఎన్నికల సమయంలో రెండు వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్‌లో ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొంత మంది బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు వివరించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు శిక్ష పడాల్సిందేనని, ఈ కేసును పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

Next Story