Konda Surekha: భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ.. నిన్న రాత్రి నుంచి పరిణామాలపై చర్చ

by Prasad Jukanti |

Konda Surekha: భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ.. నిన్న రాత్రి నుంచి పరిణామాలపై చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇష్యూ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కొండాసురేఖ ఆమె కూతురు సుష్మిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్ సమావేశానిక ముందు ప్రజాభవన్‍లో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలు, తన ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి సురేఖ ఎలాంటి అధికారిక భద్రత లేకుండా కేవలం తన వ్యక్తిగత వాహనంలో భట్టి నివాసానికి వెళ్లడం చర్చనీయాశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలోనే మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి కొండా సురేఖ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మంత్రివర్గ సమావేశానికి హజరై ఆ తర్వాత ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో కొండా భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story